శ్రీ కామినీ కామితాకార ......పాండురంగ మహాత్యం
హే కృష్ణా ముకుందా మురారీ! పాండురంగ మహాత్యం హే కృష్ణ ! శ్రీ కామినీ కామితాకార సాకార కారుణ్య ధారా నవాంకుర సంసార సంతాప నిర్వాపణా.. పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవాభావా.. హే.. వాసుదేవా! సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప ఎందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబు ఊహింపలేమైతిమో దేవా! నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ సమాదుల్ కడున్ జాల నార్జించి భోగేశ్చ వర్చించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేత్రముల్ లేక యెనీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటన్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా! యే రీతి చెన్నారముల్ మేరుషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్ను లేన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో నిన్నుదర్శింపగా! భవ్య యోగీంద్ర సాంద్రాధరా కాంక్షితై కాంత సంసేవనా భావనాతీత కళ్యాణ నానా గుణ స్త్రీ సముద్భాసితాంగ దయాపూర రంగస్థరంగాంతరంగా నమో రుక్మిణీ సంగ హే పాండురంగా..హే పాండురంగా! నమస్తే.. నమస్తే.. నమ:
